పరిటాల సునీత

పరిటాల సునీత 1970 మే నెల 28వ తేదీన అనంతపురం జిల్లా, రామగిరి మండలం, నసనకోట పంచాయితీ శివారు గ్రామాల్లో ఒకటైన వెంకటాపురంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి పేరు ధర్మవరపు కొండన్న తల్లిపేరు సత్యవతి. కొండన్నగారికి సునీతా పెద్దకుమార్తె. సునీతకు ఒక చెల్లలు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. పరిటాల రవీంద్ర కుటంబానికి సమీప బందువులు పరిటాల శ్రీరములుగారితోపాటు హత్యకు గురై మరణించిన ఆయన తమ్ముడు పరిటాల సుబ్బయ్యగారికి సునీత తండ్రి కొండన్న స్వయానా బావమరిది.

1984 అక్టోబర్ 27వ తేదీన పరిటాల రవీంద్రతో వివాహం జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. పరిటాల శ్రీరాములు గారికి ఆత్యంత సన్నిహితులయిన కవి, రచయిత కోగిర జైసీతరమ్ ఈ వివాహానికి వెళ్లి పెద్దగ వ్యవహరించారు. భర్త పరిటాల రవీంద్ర వెంట చాలాకాలంపాటు అజ్ఞాత జీవితం గడిపారు.

కేవలం ఒక సాదారణ గృహిణిగా వుంటూ వచ్చిన సునీత తన భర్త రవీంద్ర వారసులుగా అనివార్యమైన పరిస్థితుల్లో రాజకీయరంగంలోకి అడుగుపెట్టింది. పెనుకొండ నీయోజకవర్గం ప్రజానీకం ఎప్పటిలాగే పరిటాల కుటుంబానికి అండగా నిలబడింది. ప్రాణాలను సయితం పణంగ పెట్టి పరిటాల సునీతకు అఖండ విజయం సదిన్చిపెట్టింది.

  • పరిటాల సునీతా పెనుగొండ నీయోజకవర్గం నిలబెట్టుకున్న ప్రతిష్ట !
  • పెనుగొండ ప్రజల అత్మగౌరగానికి ఆమె ఒక ఆనవాలు !
  • పరిటాల కుటుంబం పీడిత ప్రజల కోసం, ప్రజాస్వామిక విలువల కోసం దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నా పోరాటానికి పరిటాల సునీత ఒక ప్రతీక !

రాజకీయల్లోకి అడుగు పెట్టంతవరుకు వాటి గురించి ఓనమాలు కూడా నేర్చుకొని సునీత అతి తక్కువ కాలంలోనే ఎంతో పరిణతిని సాధించింది. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తుంది. నీయోజకవర్గం ప్రజల తల్లో నాలుకల మసలుకుంటూన్నది. ప్రజాసమస్యలకు సరైన రీతిలో ప్రతిస్పందిస్తున్నది. జిల్లా పార్టీ రాజకీయాలో తన పాత్రని ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తోంది.

పరిటాల రవీంద్ర ప్రారంభిచిన దేవాలయన్ని మరింత అబీవృద్ధి చేయటంతోపాటు ఎటేట సమూహిక వివాహాలను కొనసాగిచాలనే క్రుతనిశ్చయంతో వుంది. తన భర్త ఆశయలుకు అనుగుణంగా దేవాలయం పరిసరాల్లో ఒక ఆదర్శ గురుకుల పాటశాలని సకల సదుపాయాలతో ఆసుపత్రిని నలకోల్పలన్నది ఆమె సంకల్పము.

పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ పేరుతో ఆయన స్మృ తిని స్పృతిని చిరస్థ యిగ నిలబడేలా చేయాలన్నది ఆమె ఆశయం. అంతపురం జిల్ల రాజకీయాల్లో పరిటాల సునీత ఒక అజేయమైన శక్తి. తెలుగు దేశం పార్టీకి పరిటాల సునీత ఒక అసెట్.

Latest News

Paritala Sriram First Public Speech

Paritala Sriram First Public Speech on the day of his grand fathers Vardhanthi. A statue of his late grand father comrade Paritala Sriramulu was...

Read More...